LOADING...
Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!

Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను తగ్గించాలని కోరిన తర్వాత గోల్డ్ రేట్లలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత నెలలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1.70లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం దాదాపు రూ.19వేల మేర తగ్గింది. మంగళవారం కూడా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.10గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై రూ.10 చొప్పున తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం,మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,29,040కు, 18 క్యారెట్ల బంగారం రూ.1,13,600కు ట్రేడవుతోంది.

వివరాలు 

తగిన వెండి ధరలు 

గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. మంగళవారం స్వల్పంగా మరోసారి తగ్గుదల నమోదైంది. 100 గ్రాముల వెండిపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం,హైదరాబాద్ మార్కెట్‌లో ఉదయం 6 గంటల సమయానికి 100 గ్రాముల వెండి ధర రూ.26,900గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశీయ డిమాండ్, ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement