LOADING...
Gold,Silver Rates: బంగారం,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
బంగారం,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Gold,Silver Rates: బంగారం,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం,వెండి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతూ ఉంది. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు, ఈ వారం కూడా మరింత పెరుగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం, జనవరి 19 సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,770 గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.

వివరాలు 

ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,09,900గా ఉంది. విజయవాడ, వైజాగ్‌లో కూడా ఈ ధరల పరిధిలోనే ట్రేడింగ్ జరుగుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర కనీసం రూ.2,94,900 వద్ద ఉంది. ఈ వారం బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వెండి ధరల్లో కొద్దిరోజులపాటు స్వల్ప సవరణలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ స్వల్ప తగ్గింపు తాత్కాలికమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు మరింత పెరగకతప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24కే, 22కే)

చెన్నై: ₹1,44,860; ₹1,32,790; ముంబై: ₹1,43,770; ₹1,31,790; న్యూఢిల్లీ: ₹1,43,920; ₹1,31,940; కోల్‌కతా: ₹1,43,770; ₹1,31,790; బెంగళూరు: ₹1,43,770; ₹1,31,790; హైదరాబాద్: ₹1,43,770; ₹1,31,790; విజయవాడ: ₹1,43,770; ₹1,31,790; కేరళ: ₹1,43,770; ₹1,31,790; పుణె: ₹1,43,770; ₹1,31,790; వడోదరా: ₹1,43,820; ₹1,31,840; అహ్మదాబాద్: ₹1,43,820; ₹1,31,840;

Advertisement

వివరాలు 

వెండి (కిలో) ధరలు ఇవీ

చెన్నై: ₹3,09,900 ముంబై: ₹2,94,900 న్యూఢిల్లీ: ₹2,94,900 కోల్‌కతా: ₹2,94,900 బెంగళూరు: ₹2,94,900 హైదరాబాద్: ₹3,09,900 విజయవాడ: ₹3,09,900 కేరళ: ₹3,09,900 పుణె: ₹2,94,900 వడోదరా: ₹2,94,900 అహ్మదాబాద్: ₹2,94,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Advertisement