LOADING...
EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ఓ 'పాస్‌బుక్ లైట్' ఫీచర్ ప్రారంభం
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ఓ 'పాస్‌బుక్ లైట్' ఫీచర్ ప్రారంభం

EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ఓ 'పాస్‌బుక్ లైట్' ఫీచర్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల సౌలభ్యం కోసం కొత్త పాస్‌బుక్ లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు ఇకపై లాగిన్ అవ్వకుండానే ఒకే క్లిక్‌తో తమ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు బ్యాలెన్స్ లేదా లావాదేవీలను చూడాలంటే ప్రత్యేక పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ఆ సమస్య తొలగింది. ఇకపై ఫోన్‌లో SMS రాకపోయినా ఖాతాలో జమ అయిన మొత్తాన్ని పాస్‌బుక్ లైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులు తమ కాంట్రిబ్యూషన్, విత్‌డ్రా మొత్తం, బ్యాలెన్స్ వంటి పూర్తి వివరాలను నేరుగా మెంబర్స్ పోర్టల్‌లో వీక్షించవచ్చు.

Details

పాస్‌బుక్ పోర్టల్‌పై భారాన్ని తగ్గించడమే లక్ష్యం

కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించారు. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యం కల్పించడమే కాకుండా, ప్రస్తుత పాస్‌బుక్ పోర్టల్‌పై భారాన్ని తగ్గించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇకపై కావాల్సిన సమాచారం కోసం ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అవసరమైన అన్ని వివరాలు ఒకే చోట లభిస్తాయి. సభ్యులు స్క్రీన్‌షాట్ తీసుకోవడం ద్వారా తమ పీఎఫ్ సమాచారం భద్రపరచుకోవచ్చు. అలాగే, త్వరగా వివరాల కోసం శోధించవచ్చు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, పాత ఖాతా నుండి కొత్త ఖాతాకు నిధులు సక్రమంగా బదిలీ అయ్యాయా లేదా అనేది ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేయవచ్చు. కొత్త పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్, సేవా వివరాలు సరిగా అప్‌డేట్ అయ్యాయా లేదా కూడా తనిఖీ చేసుకోవచ్చు.