Railway Card: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఇప్పుడు ఈ కార్డుతో, రైల్వే ఉద్యోగులు నేరుగా AIIMS,PGIలలో చికిత్స పొందగలరు
మన దేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. రోజువారీగా లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు, వీరికి సేవలందించడానికి అనేక ఉద్యోగులు కృషి చేస్తుంటారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం ఇండియన్ రైల్వేస్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్‌కేర్ పాలసీలో మార్పులు చేసి, యూనిక్ మెడికల్ ఐడెంటిఫికేషన్ (UMID) కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డులు రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా రూపొందించబడ్డాయి. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఉద్యోగులు,పన్షనర్లకు మెడికల్ సేవల్లో అనేక ప్రయోజనాలు అందిస్తోంది.
గుర్తింపు పొందిన మెడికల్ ఇనిస్టిట్యూట్స్‌లో రిఫరల్ లేకుండా వైద్యం
ఈ కొత్త UMID కార్డులు, రైల్వే ప్యానెల్ ఆసుపత్రులు, AIIMS వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ కార్డుల కోసం రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది సుమారు 12.5 లక్షల ఉద్యోగులు, 15 లక్షల పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ విధానం వల్ల ఆరోగ్య సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది. అవసరమైతే జాతీయస్థాయి గుర్తింపు పొందిన మెడికల్ ఇనిస్టిట్యూట్స్‌లో కూడా రిఫరల్ లేకుండా వైద్యం పొందవచ్చు. రైల్వే ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్ డిజిలాకర్‌లో భద్రంగా నిల్వ చేయబడుతుంది, ఇది వారి ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేస్తుంది. UMID కార్డులు, ఎమర్జెన్సీ వైద్యం, సాధారణ చికిత్స కోసం ఉపయుక్తంగా ఉంటాయి.