Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త.. ఆదాయం పెంపుపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు పార్లమెంట్ వేదికగా ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ క్రమంలో 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, మత్స్య అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. అలాగే పశు సంవర్ధక శాఖకు భారీ ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ గల పంటలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు.
Details
కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు
ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించారు. అలాగే కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం అమలు చేస్తామని, కాయలు కాయని పాత చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై రైతులు మరో ఆశ పెట్టుకున్నారు. పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతుందని వారు ఆశిస్తున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద ప్రస్తుతం రైతులకు ఏటా రూ.6,000మాత్రమే అందుతోంది. అయితే దీనిని రూ.8,000లేదా రూ.10,000కు పెంచాలని రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.