LOADING...
Gold silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Gold silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి ఏడాది పాటు బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గించాలని చేసిన విజ్ఞప్తి తర్వాత మార్కెట్‌లో కొనుగోళ్లు మందగించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వరుసగా రెండోరోజూ గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోవడం గమనార్హంగా మారింది. మోదీ ప్రకటనతో దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారుల్లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు ఇప్పుడు తగ్గుదల దిశగా సాగుతున్నాయి.

వివరాలు

రెండ్రోజుల్లో 15వేల వరకు తగ్గింపు

శనివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.980 తగ్గుదల నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 మేర తగ్గింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.15 వేల మేర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు గోల్డ్ ధరపై 30 డాలర్ల తగ్గుదల నమోదవడంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్ ధర 4,715 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.10 వేల తగ్గుదల నమోదవగా, శనివారం మరో రూ.15 వేల మేర తగ్గింది.

వివరాలు

నన

దీంతో గత మూడు రోజుల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.30 వేల మేర పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,930 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,850గా నమోదైంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని న్యూదిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,080గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,000 వద్ద కొనసాగుతోంది.

Advertisement

వివరాలు

నన

ఇక ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,850 వద్ద నమోదైంది. వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.

Advertisement