Tesla: టెస్లాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు పలికారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో ఆమె పనిచేసింది. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులకు సరదాగా ఉండటం కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామాను లింక్డిన్‌లో షేర్ చేశారు. శ్రీలా వెంకటరత్నం 2013లో టెస్లాలో చేరారు. గత 11 ఏళ్ల పాటు టెస్లాకు సేవలందించారు.
11 ఏళ్ల పాటు సేవలందించిన శ్రీలా వెంకటరత్నం
మొదటగా డైరక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆపరేషన్ హోదాలో చేరిన ఆమె, తర్వాత డైరక్టర్‌గా హోదా పొందారు. ఇక 2019 నుంచి 2024 వరకు వైస్ ప్రెసిడెంట్ పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తాను కంపెనీలో చేరిన తర్వాతే టెస్లా 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవరించిందని సంతోషం వ్యక్తం చేశారు. కొంతకాలం పాటు విరామం తీసుకొని తర్వాతే కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని ఆమె పేర్కొన్నారు. తన ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించానని, తన తోటి ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు టెస్లాను వీడడం గమనార్హం.