Page Loader
మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు
ఎవ్రీడే రోబోట్స్‌లో టీమ్ 100కి పైగా రోబోట్‌లను అభివృద్ధి చేసింది

మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 25, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తొలగింపులు ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆఖరికి రోబోలు కూడా సురక్షితంగా ఉండవని ఆల్ఫాబెట్ నిర్ణయం రుజువు చేస్తుంది. ప్రయోగాత్మక విభాగాన్ని మూసివేయాలని కంపెనీ నిర్ణయించడం కూడా వీటి తొలగింపులకి కారణం. ఆల్ఫాబెట్ దృష్టి ఇప్పుడు OpenAI ChatGPTలాంటి వాటితో పోటీపడటానికి దాని AI సామర్థ్యాలను మెరుగుపరచడం.

గూగుల్

ఎవ్రీడే రోబోట్స్‌లో టీమ్ 100కి పైగా రోబోట్‌లను అభివృద్ధి చేసి అనేక పనుల్లో శిక్షణ ఇచ్చారు

ఎవ్రీడే రోబోట్స్‌లో టీమ్ 100కి పైగా రోబోట్‌లను అభివృద్ధి చేసి, ఇతర పనులతోపాటు టేబుల్స్ సర్దడం, రీసైకిల్ కోసం చెత్తను వేరు చేయడం, తలుపులు తెరవడం వంటి శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందుతున్నప్పుడు, రోబోట్‌లు కంపెనీ డైనింగ్ హాల్‌ను చక్కబెట్టడం, మహమ్మారి సమయంలో సమావేశ గదుల శుభ్రతను చెక్ చేయడం వంటి అనేక పనులను చేపట్టాయి. ఎవ్రీడే రోబోట్‌లు ఇకపై ఆల్ఫాబెట్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా ఉండవని ఎవ్రీడే రోబోట్‌ల మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డెనిస్ గంబోవా అన్నారు. రోబోటిక్స్‌పై ఆసక్తితో గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌ ఒక దశాబ్దం క్రితం రోబోటిక్స్ కంపెనీలను కొనుగోలు చేశారు. అయితే వినియోగదారుకు అవసరమయ్యే ఉత్పత్తిని కనుగొనాలనే కంపెనీ తపన ఇంకా అలానే ఉండిపోయింది.