గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్
టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఆల్ఫాబెట్ నిర్ణయం వలన ఆ సంస్థ ప్రపంచవ్యాప్త సిబ్బందిలో 6% మంది ప్రభావితమవుతారు. రిక్రూటింగ్, కొన్ని కార్పొరేట్ సర్వీసెస్, ప్రోడక్ట్ , ఇంజినీరింగ్‌తో సహా కంపెనీలో అన్ని టీమ్స్ లో ప్రాభవం ఉంటుంది. సంస్థ ఇప్పటికే బాధిత ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. US సిబ్బందిపై ఈ నిర్ణయ ప్రాభవం వెంటనే ఉంటుంది, అయితే స్థానిక ఉపాధి చట్టాలు కారణంగా మిగిలిన దేశాలలో దీనికి ఎక్కువ సమయం పడుతుంది.
ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గిన కంపెనీ
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆల్ఫాబెట్ 63,000 మంది సిబ్బందిని నియమించుకుంది. గత సంవత్సరం, బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్టోఫర్ హోన్ ఆల్ఫాబెట్‌ను గూగుల్ లో ఎక్కువగా ఉన్న సిబ్బందిని తగ్గించమని కోరారు.ఇన్వెస్టర్ల ఒత్తిడికి కంపెనీ తలొగ్గినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు 6 నెలల హెల్త్ ఇన్సూరెన్స్, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ తో పాటు ఉద్యోగులు ఇతర అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు కంపెనీ వారికి అండగా ఉంటుందని పిచాయ్ పేర్కొన్నారు. USలో, ఆల్ఫాబెట్ నోటీసు వ్యవధిలో పూర్తి జీతం ఉద్యోగులకు చెల్లిస్తుంది. ఈ ఉద్యోగులకు గూగుల్ లో ప్రతి సంవత్సరం రెండు వారాల జీతంతో పాటు 16 వారాల జీతంతో సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తారు.