Page Loader
సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్
ఎంపిక చేసిన ప్రాంతాలకు సౌండ్‌పాడ్ పంపిణీ చేస్తున్న గూగుల్

సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 18, 2023
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్. గూగుల్ భారతదేశంలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో స్వంత సౌండ్‌బాక్స్‌ను ఇవ్వడం ప్రారంభించింది. గూగుల్ పే ద్వారా సౌండ్‌పాడ్ పేరుతో స్పీకర్ న్యూ ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేస్తుంది. ఎంపిక చేసిన వ్యాపారులకు ఎలాంటి ఖర్చు లేకుండా కంపెనీ వాటిని పంపిణీ చేస్తుంది. గూగుల్ పే ప్రతినిధులు వ్యాపారులకు సౌండ్‌పాడ్‌ డెలివరీకి టైమ్‌ఫ్రేమ్‌ను సెటప్ చేస్తున్నారు.

గూగుల్

ఇటువంటి డివైజ్ లు ముందే లాంచ్ చేసిన పేటియం, ఫోన్ పే

ఇతర సౌండ్‌బాక్స్‌ల లాగానే ఇందులో కూడా చెల్లింపు మొత్తం, బ్యాటరీ, నెట్‌వర్క్ స్థితి, మాన్యువల్ సెట్టింగ్స్ చూపే LCD స్క్రీన్‌ ఉంది. దీనికి ముందు ఒక QR కోడ్ ఉంటుంది, ఇది బ్యాంక్‌లో నమోదు చేయబడిన వ్యాపారి ఫోన్ నంబర్‌కు లింక్ అవుతుంది. సౌండ్‌బాక్స్ విషయంలో గూగుల్ చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో చెల్లింపుల మార్కెట్‌లో పైచేయి ఉన్నా సరే ఇప్పటివరకు ఈ అంశంలో ముందుకు వెళ్లలేకపోయింది. దేశంలో మొట్టమొదటి సౌండ్‌బాక్స్‌ను 2020లో పేటియం మొదలుపెట్టింది. ఫోన్ పే గత సంవత్సరం తన స్మార్ట్ స్పీకర్ ని పరిచయం చేసింది. భారతదేశంలో UPI లావాదేవీలు ఉచితం. ఫిన్‌టెక్ కంపెనీలు వాటి ఆదాయం కోసం కొంతకాలంగా ఈ మోడల్‌లో మార్పును సూచిస్తున్నాయి.