మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారంగా మారాయి. అమెజాన్, మెటాతో సహా కొన్ని దిగ్గ టెక్ కంపెనీలు ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈఓ సుందర్ పిచాయ్ రెండో దఫా సామూహిక ఉద్యోగుల తొలగించే అవకాశాన్ని తొసిపుచ్చకపోవడం గమనార్హం.
గూగుల్ మరింత మంది ఉద్యోగులను తొలగించబోతోందా? అమెజాన్, మెటా బాటలోనే గూగుల్ వెళ్తుందా? అని అడిగినప్పుడు, అవసరాన్ని ఉద్యోగులను తరలిస్తామని పిచాయ్ చెప్పారు.
గూగుల్ మరింత మందిని తొలగిస్తుందని ఆయన స్పష్టంగా చెప్పలేదు. అలాగని, చేయబోమని కూడా చెప్పలేదు. కానీ చాలా పని మిగిలి ఉందని పిచాయ్ చెప్పడం గమనార్హం.
గూగుల్
ఏం చేయాలనే దానిపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది: పిచాయ్
అయితే గూగుల్ ఏ ఉద్దేశంతో మరింత మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని విలేకరి అడిగినప్పుడు పిచాయ్ ఈ విధంగా సమాధానం చెప్పారు.
తమ విధానంతో సౌకర్యవంతంగా ఉన్నామని చెప్పారు. తమకు అవసరమైన ఆవిష్కరణలు చేయడం, ఒక కంపెనీగా మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నామని నిర్ధారించుకోవడం వంటి విషయాలలో ఏమి చేయాలనే దానిపై తమకు స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు.
మార్క్ జూకర్ బర్గ్ 2023ని 'నైపుణ్య సమర్థత సంవత్సరం'గా ప్రకటించారు. గూగుల్ కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని యోచిస్తోందని పిచాయ్ అన్నారు. కాస్ట్ బేస్‌ని మన్నికైన మార్గంలో రీ-ఇంజనీర్ చేయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు.