Page Loader
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి 
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి

భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి 

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంపెనీల చట్టంలో చేసిన సవరణ అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు 30వ తేదీన రాత్రి కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కాపీని పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రం అందజేయనుంది. విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీలను నేరుగా లిస్ట్ అవడానికి కంపెనీల (సవరణ) చట్టం, 2020లోని సెక్షన్ 5ను ప్రభుత్వం సవరించింది. అయితే, కొన్ని షరతులు పాటించే కంపెనీలకు మాత్రమే విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అనుమతి ఇవ్వడం జరుగుతుందని కేంద్రం వివరించింది.

స్టాక్

నియమ నిబంధనలను రూపొందించే పనిలో కేంద్రం

ప్రస్తుతం భారతీయ కంపెనీలు 'అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌', 'గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌' ద్వారా విదేశీ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. విదేశీ ఎక్స్చేంజీల్లో భారతీయ కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇంకా రూపొందించాల్సి ఉంది. అక్టోబర్ 16న భారతీయ కంపెనీల ప్రత్యక్ష విదేశీ లిస్టింగ్‌కు అర్హత ప్రమాణాలను రూపొందించే పనిలో ఎంసీఏ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నిమగ్నమైనట్లు సీఎన్‌బీసీ-టీవీ 18 పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పబ్లిక్ కంపెనీల గురించి మాత్రమే ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే అన్‌లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీలకు కూడా అలాంటి డైరెక్ట్ లిస్టింగ్‌ను అనుమతించడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.