Page Loader
అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 
అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'

అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

వ్రాసిన వారు Stalin
Jun 28, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి. గత నాలుగు నెలల్లో ఏకంగా మూడు దఫాలుగా 'జీక్యూజీ' సంస్థ అదానీ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేసింది. తాజాగా బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్‌లను కొనుగోలు చేసినట్లు బుధవారం ఒక నివేదిక తెలిపింది. 'జీక్యూజీ'తో పాటు ఇతర పెట్టుబడిదారులు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ గ్రూప్ స్టాక్‌లలో 1 బిలియన్ డాలర్ల విలువ చేసే అదనపు వాటాలను కొనుగోలు చేసినట్లు ఈటీ నౌ పేర్కొంది. హిండెన్‌బర్గ్ నివేదికకు వ్యతిరేకంగా పోరాడుతున్న అదానీ గ్రూప్‌లో జీక్యూజీ తన వాటాను సుమారు 10శాతానికి పెంచుకుంది.

అదానీ

చేతులు మారిన 18 మిలియన్ షేర్లు 

గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి సంబంధించిన 18 మిలియన్ షేర్లు లేదా 1.6శాతం షేర్లు చేతులు మారాయి. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మొత్తం 35.2 మిలియన్ షేర్లు లేదా 2.2% ఈక్విటీ బుధవారం ఇన్వెస్టర్లు బ్లాక్ డీల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ డీల్ తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 5.5శాతం పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ బ్లాక్ ట్రేడ్‌ను రూ. 2,300గా నిర్వహించగా, అదానీ గ్రీన్ డీల్ ధర రూ.920గా ఉందని బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది.