Groww IPO: నవంబర్ 4 నుంచి ₹6,632 కోట్లతో గ్రో ఐపీఓ.. 12న లిస్టింగ్.. ధరల శ్రేణి, ఇతర వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ తమ ఐపీఓ (Groww IPO)ను నవంబర్ 4న ప్రారంభించనుంది. ఈ ఇష్యూ నవంబర్ 7తో ముగియనుంది. మొత్తం ₹6,632 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తున్న ఈ సంస్థ, షేర్ ధరల శ్రేణిని ₹95-₹100గా నిర్ణయించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ₹61,700 కోట్ల విలువ వద్ద వస్తోంది. నవంబర్ 3న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది. నవంబర్ 12న షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ ఇష్యూ కేటాయింపులో కంపెనీ 75% షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు, 15% నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మరియు 10% రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.
వివరాలు
ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో 55.72 కోట్ల ఈక్విటీ షేర్లు
ఐపీఓలో భాగంగా కంపెనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹1,060 కోట్లు సమీకరించనుంది. అదనంగా, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించబోతున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రమోటర్లు లలిత్ కేసరి, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ ఒక్కొక్కరు 1 మిలియన్ షేర్లు విక్రయించనున్నారు. అలాగే పీక్ XV పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ VI-1,వైసీ హోల్డింగ్స్ II,ర్యాబిట్ క్యాపిటల్ V, జీడబ్ల్యూ-E రిబ్బిట్ ఆపర్చునిటీ, ఇంటర్నెట్ ఫండ్ VI PTE లిమిటెడ్, కౌఫ్‌మన్ ఫెలోస్ ఫండ్ LP సంస్థలు కూడా తమ వాటాలను విక్రయించనున్నాయి. 2016లో స్థాపించబడిన గ్రో,కొద్ది కాలంలోనే వేగంగా ఎదిగి, 12.6 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో దేశంలోనే ప్రముఖ స్టాక్ బ్రోకర్‌గా ఎదిగింది.
వివరాలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో.. గ్రో రూ.1824 కోట్ల నికర లాభం
2016లో స్థాపించన గ్రో,కొద్ది కాలంలోనే వేగంగా ఎదిగి, 12.6 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో దేశంలోనే ప్రముఖ స్టాక్ బ్రోకర్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ సంస్థ 26% మార్కెట్ షేర్ను కలిగి ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను బ్రాండ్ బిల్డింగ్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, టెక్నాలజీ పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు గ్రో సహ వ్యవస్థాపకుడు,సీఓఓ హర్ష్ జైన్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, గ్రో ₹1,824 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు అధికం.
వివరాలు
రూ.34 వేల కోట్లు సిప్ రూపంలో మ్యాచువల్ ఫండ్స్‌లోకి..
సెబీ ఎఫ్‌అండ్‌ఓ నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ, సంస్థ లాభాలను గణనీయంగా పెంచగలిగింది. అదే ఆర్థిక సంవత్సరంలో, గ్రో వేదికగా ₹34,000 కోట్ల సిప్ (SIP) రూపంలో మ్యాచువల్ ఫండ్లలో పెట్టుబడులు వెళ్లాయి. ఇది మొత్తం మార్కెట్ వాటాలో 11.8%కు సమానం. దేశం అంతటా సంస్థ సేవలు విస్తరించడానికి ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషించిందని, ఈ సందర్భంగా హర్ష్ జైన్ పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు.