GST collections: డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.77లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి గణనీయమైన స్థాయిలో నమోదయ్యాయి.
2023 డిసెంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు వసూలయ్యాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023 డిసెంబరుతో పోల్చితే, ఈ నెల వృద్ధి రేటు 7.3 శాతం ఉంది.
ఇందులో సీజీఎస్‌టీ కింద రూ.32,836 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ కింద రూ.91,200 కోట్లు, అలాగే సెస్‌ల రూపంలో రూ.12,300 కోట్లు వసూలయ్యాయి.
వివరాలు
నవంబరుతో పోల్చితే, డిసెంబరులో ఈ వసూళ్లు కాస్త తగ్గాయి
దేశీయ లావాదేవీలపై ఉన్న జీఎస్‌టీ 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లు సాధించాయి.
దిగుమతులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లుగా నమోదు అయ్యింది.
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది పదో నెల .
అయితే, నవంబరుతో పోల్చితే, డిసెంబరులో ఈ వసూళ్లు కాస్త తగ్గాయి. 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి.