ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్
జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పాన్ మసాలా, గుట్కా పరిశ్రమల ద్వారా పన్ను ఎగవేతలను చెక్ చేస్తున్నామని, వస్తు, సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ పై మంత్రుల బృందం నివేదికలు కూడా ఉన్నాయని అన్నారు. జూన్ నెలకు సంబంధించి రూ. 16,982 కోట్లతో సహా అన్ని జిఎస్‌టి పరిహారం బకాయిలు క్లియర్ చేసేలా చర్యలు చేపడతామని ఆమె అన్నారు.
వార్షిక జిఎస్‌టి రిటర్న్‌ల దాఖలుపై వేసే ఆలస్య రుసుము సరైనదే అంటున్న కౌన్సిల్
గడువు తేదీ తర్వాత వార్షిక జిఎస్‌టి రిటర్న్‌ల దాఖలుపై వేసే ఆలస్య రుసుమును జిఎస్‌టి కౌన్సిల్ సమర్ధించుకుంది. ఈ జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.