
Gold: పాత బంగారం ఇచ్చినా జీఎస్టీ తప్పదు.. వినియోగదారుల్లో అసంతృప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
పాత బంగారాన్ని ఎక్స్ఛేంజి చేసి కొత్త ఆభరణాలను కొనుగోలు చేసే సందర్భంలో జీఎస్టీ ఎలా కట్టాలి అన్న విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.
పాత బంగారం విలువను మినహాయించి మిగతా మొత్తం పైనే జీఎస్టీ వసూలు చేయాలన్న అభిప్రాయంతో కొన్ని దుకాణాల్లో వినియోగదారులు వాదనకు దిగుతున్నారు.
అయితే ఇది సాధ్యపడదని, కొత్త ఆభరణం మొత్తంపైనే జీఎస్టీ విధించాల్సి ఉంటుందని బంగారం వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ ప్రముఖ జువెలరీ దుకాణం మేనేజర్ మాట్లాడుతూ పాత బంగారం విలువకు సంబంధం లేకుండా, కొత్త బంగారానికి ఇచ్చే మొత్తంపైనే జీఎస్టీ తీసుకుంటాం.
Details
మొత్తం అమ్మకంపై బిల్లు
ఉదాహరణకు రూ. లక్ష విలువైన ఆభరణం కొంటే దానిపై ఐజీఎస్టీ కింద 1.5 శాతం, సీజీఎస్టీ కింద మరో 1.5 శాతం కలిపి మొత్తం రూ.3 వేలు వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా పెద్దఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగిన నేపథ్యంలో ఈ సమస్య మరింత ప్రముఖంగా మారింది. ప్రజలు ఎక్కువగా పాత బంగారం ఇచ్చి, అదనంగా కొంత నగదు చెల్లించి కొత్త ఆభరణాలు కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వినియోగదారులు అడిగే ప్రధాన ప్రశ్న. పాత బంగారం విలువను మినహాయించి మిగిలిన మొత్తంపై మాత్రమే జీఎస్టీ వేయాలని సరైనది కాదని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు.
ఎందుకంటే పన్ను అధికారుల తనిఖీల్లో 'మొత్తం అమ్మకంపై' బిల్లు వేశారు.
Details
ఆభరణాల నాణ్యతపై అనుమానాలు వచ్చే అవకాశం
లేదా దానిపై 3 శాతం జీఎస్టీ ఖజానాకు చెల్లించారా అన్నదే కీలకం. పాత బంగారం విలువను మినహాయించి చూడటం అనుమతించబడదు.
దీంతో పాటు, జీఎస్టీ మిగులుతుందని చిన్నచిన్న వ్యాపారుల వద్ద బంగారం కొంటున్న కస్టమర్లు ఉన్నారు. కానీ, అటువంటి ఆభరణాల నాణ్యతపై అనుమానాలు రావొచ్చని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
ఒక ఉదాహరణగా, ఓ వ్యక్తి దగ్గర నాలుగు తులాల బంగారం బయట వ్యాపారి వద్ద కొనుగోలు చేశారు.
కానీ ఇటీవల అదే బంగారాన్ని ప్రముఖ దుకాణంలో ఎక్స్ఛేంజి చేయించేందుకు తీసుకెళ్తే, అది కేవలం 15 క్యారెట్లే ఉందని, కనీసం 16 క్యారెట్లు లేకపోతే తీసుకోవడం సాధ్యం కాదని దుకాణం తిరస్కరించిందని తెలిపారు.
Details
పాత బంగారం విలువపై జీఎస్టీ మినహాయింపు లేదు
మొత్తానికి, ఎక్స్ఛేంజి పద్ధతిలో పాత బంగారం విలువపై జీఎస్టీ మినహాయింపు ఏమాత్రం లేదు.
జీఎస్టీ పూర్తిగా చెల్లించి, సరైన బిల్లు తీసుకున్న వినియోగదారులకే భవిష్యత్తులో ఆ ఆభరణాలను అమ్మడం, లెక్కల్లో చూపించడం సురక్షితంగా ఉంటుందని పన్ను శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.