
GST: నేటి నుంచి కొత్త 'జీఎస్‌టీ'.. తగ్గనున్న 375 వస్తువుల ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం నుంచి వంటింటి అవసరాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు,వైద్య పరికరాలు,వాహనాలు, అలాగే వ్యక్తిగత జీవిత బీమా,ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. కొత్త జీఎస్‌టీ 2.0 కింద మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గింపు పొందుతున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ రంగ కంపెనీలు ఈనెల 22వ తేదీ నుంచి తమ ఉత్పత్తుల ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం సూచనల ప్రకారం,మందులు లేదా అవసరమైన వస్తువుల ప్యాక్‌లపై కొత్త ధరలు ముద్రించకపోయినా,విక్రయాల సమయంలో తగ్గించిన ధరలే అమలు కావాలి. అంతేకాక, హెల్త్ క్లబ్‌లు, సెలూన్లు, యోగా-వ్యాయామ కేంద్రాలు, అలాగే ఫేస్‌పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను రేటు 18% నుంచి 5%కు తగ్గించబడింది.
వివరాలు
రూ.2 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ మార్కెట్లోకి..
అయితే హానికరమైన ఉత్పత్తులపై మాత్రం జీఎస్‌టీ 28% నుంచి 40%కు పెంచారు. ఈ నిర్ణయం వల్ల సుమారు రూ.2 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఔషధాలపై తగ్గింపు ఇంతకుముందు 12%గా ఉన్న పన్ను ఇప్పుడు 5%కు తగ్గింది. అలాగే క్యాన్సర్ సహా ఇతర క్లిష్ట వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 36 రకాల ఔషధాలపై పన్నును పూర్తిగా రద్దు చేశారు. వాహనాల ధరల తగ్గింపు ద్విచక్ర వాహనాల ధరలు గరిష్టంగా రూ.18,800 వరకు తగ్గనున్నాయి. కార్ల ధరలు రూ.4.48 లక్షల వరకు తగ్గుతున్నాయి. లగ్జరీ కార్ల ధరలు అయితే గరిష్టంగా రూ.30.4 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది.
వివరాలు
టీవీల ధరలు భారీగా తగ్గింపు
జీఎస్‌టీ 28% నుంచి 18%కు తగ్గడంతో 32 అంగుళాల కంటే పెద్ద స్క్రీన్ ఉన్న టీవీల ధరలు రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గనున్నాయి. పండగ సీజన్‌లో టీవీ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ తగ్గింపులు కొనుగోళ్లకు ఉత్సాహం కలిగిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. సోనీ ఇండియా:బ్రావియా మోడళ్ల (43-98 అంగుళాలు)ధరలు రూ.5,000-71,000వరకు తగ్గాయి. ఉదాహరణకు,43 అంగుళాల టీవీ రూ.59,900 నుంచి రూ.54,900కి, 55 అంగుళాలది రూ.2.5 లక్షల నుంచి రూ.2.3 లక్షలకు తగ్గింది. 98 అంగుళాల టీవీ రూ.9లక్షల నుంచి రూ.8.29లక్షలకు వచ్చింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్: 43 అంగుళాల టీవీ ధర రూ.30,990 నుంచి రూ.28,490కి తగ్గింది. 55, 65 అంగుళాల టీవీల ధరలు రూ.3,400 తగ్గి వరుసగా రూ.42,990, రూ.68,490లకు వచ్చాయి.
వివరాలు
హోటల్ గదుల అద్దెపై జీఎస్‌టీ తగ్గింపు
100 అంగుళాల టీవీ ధర రూ.5,85,590 నుంచి రూ.4,99,790కి దిగింది. పానసోనిక్: 43 అంగుళాల టీవీల ధరలు రూ.3,000 తగ్గి వరుసగా రూ.33,990, రూ.45,990, రూ.54,290లకు పరిమితమయ్యాయి. 55 అంగుళాల టీవీలు రూ.7,000 తగ్గి రూ.65,990, రూ.76,990లకు తగ్గాయి. ఇకపై రూ.7,500 లోపు అద్దె గల హోటల్ గదులపై రూ.525 వరకు ఆదా కానుంది. వీటిపై పన్ను రేటు 12% నుంచి 5%కి తగ్గించబడింది. అయితే దీనిపై ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) వర్తించదు. ఈ నిర్ణయం హోటల్ రంగానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని, పెట్టుబడులకు, మంచి సేవలందించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
వివరాలు
పతంజలి ఫుడ్స్ ధరల తగ్గింపు
పతంజలి ఫుడ్స్ తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. న్యూట్రెలా సోయా ఉత్పత్తులు: ఒక కిలో చంక్స్, మినీ చంక్స్,గ్రాన్యూల్స్ ధర రూ.210 నుంచి రూ.190కి తగ్గింది.200 గ్రాముల ప్యాక్‌పై రూ.3 తగ్గించారు. బిస్కట్లు: 35గ్రాముల దూద్ బిస్కట్ రూ.5 నుంచి రూ.4.5కి తగ్గింది. ఇతర ఉత్పత్తులు: నూడుల్స్,నోటి సంరక్షణ,కేశ సంరక్షణ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. దంత్ కాంతి టూత్‌పేస్ట్ (200 గ్రా.):రూ.120 నుంచి రూ.106కి తగ్గింది. కేశ్‌కాంతి ఆమ్లా హెయిర్ ఆయిల్ (100 ఎంఎల్):రూ.48 నుంచి రూ.42కి తగ్గింది. ఆరోగ్య ఉత్పత్తులు: ఆమ్లా జ్యూస్ (1000 ఎంఎల్)రూ.150 నుంచి రూ.140కి,స్పెషల్ చవన్‌ప్రాశ్ (కిలో) రూ.360 నుంచి రూ.337కి తగ్గాయి. ఆవు నెయ్యి (900 ఎంఎల్): రూ.780 నుంచి రూ.732కి తగ్గింది.