Page Loader
HDFC: లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC 
లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC

HDFC: లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన తొలి శాఖను ప్రారంభించింది. లక్షద్వీప్ లోని కవరత్తి ద్వీపంలో మొదటి బ్రాంచ్ ప్రారంభించిన బ్యాంక్ గా HDFC వార్తల్లో నిలిచింది. మాల్దీవులతో వివాదాల నేపథ్యంలో లక్షద్వీప్ కి ప్రాధాన్యత ఏర్పడింది.దీంతో అక్కడ టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఈ తరుణంలో HDFC బ్యాంక్ తన శాఖను అక్కడ ప్రారంబించింది.దేశ వ్యాప్తంగా 8901 బ్రాంచ్ లు ఉన్న HDFC బ్యాంక్ లక్షద్వీప్ లో కూడా తన సేవలు అందిస్తామని వెల్లడించింది. కస్టమర్‌లు ఎక్కడ ఉన్నా వారికి సేవలందించేందుకు బ్యాంకు ప్రయత్నిస్తుందని, లక్షద్వీప్‌లోని వ్యక్తులు,కుటుంబాలు,వ్యాపారాల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎదురుచూస్తున్నట్లు బ్యాంక్ రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ ఎస్ సంపత్‌కుమార్ తెలిపారు.

Details

క్యూ ఆర్ కోడ్ ఆధారిత సేవలు

బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈ శాఖను ఇండియన్ నేవీ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ లవ్‌కేష్ ఠాకూర్, కెపి ముత్తుకోయ ప్రారంభించినట్లు ప్రకటనలో తెలిపారు. పర్సనల్‌, డిజిటల్‌ బ్యాకింగ్‌ సహా కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందిస్తూ ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో సేవలను మెరుగుపరుస్తామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. రిటైలర్లకు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత లావాదేవీలను సైతం అందిస్తామని వెల్లడించింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ పర్యటక ప్రదేశాలన్నింటిలో హెచ్‌డీఎఫ్‌సీ శాఖలున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్షద్వీప్ లో HDFC తొలి ప్రైవేట్ బ్యాంక్