LOADING...
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్‌.. రూ..1 లక్ష కోట్లు ఆవిరి, LIC-FIIలకు భారీ నష్టం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్‌.. రూ..1 లక్ష కోట్లు ఆవిరి, LIC-FIIలకు భారీ నష్టం

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్‌.. రూ..1 లక్ష కోట్లు ఆవిరి, LIC-FIIలకు భారీ నష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపదకు గట్టి దెబ్బ తగిలింది. పార్ట్‌టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి రాజీనామా చేయడం, 'విలువలు, నైతికతల విషయంలో భేధాభిప్రాయాలు' ఉన్నాయని పేర్కొనడం మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రభావంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తాత్కాలికంగా రూ.12 లక్షల కోట్ల కంటే దిగువకు జారింది. బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర ఏకంగా 8 శాతం పడిపోయి ₹772 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. గత ముగింపు ధర ₹842.95తో పోలిస్తే ఇది భారీ పతనమే.

Details

ఏడీఆర్ లు కూడా 7 శాతం వరకు క్షీణిత

రాత్రికి రాత్రే ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతినడంతో, విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఏడీఆర్ లు కూడా 7 శాతం వరకు క్షీణించాయి. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ ₹12.96 లక్షల కోట్ల నుంచి ₹11.88 లక్షల కోట్లకు పడిపోయి, ఒక్క రోజులోనే ₹1 లక్ష కోట్లకు పైగా ఆవిరైంది. మార్చి నెలలో ఇప్పటివరకు ఈ షేర్ దాదాపు 9 శాతం క్షీణించడంతో, గత ఆరు సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద నెలవారీ పతనంగా నమోదవుతోంది.

Details

ఇన్వెస్టర్లకు భారీ నష్టం

డిసెంబర్ త్రైమాసికం నాటికి 47.70% వాటా కలిగిన FIIsకు ఈ పతనంతో ₹45,072 కోట్లు నష్టం వాటిల్లింది. సింగపూర్ ప్రభుత్వం (2.27% వాటా) సుమారు ₹2,150 కోట్లు నష్టపోయింది. వాన్గార్డ్ గ్రూప్ (1.24% వాటా) ₹1,176 కోట్లు నష్టం చవిచూసింది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్ (1.22% వాటా) ₹1,151.27 కోట్లు నష్టపోయింది. దేశీయంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ప్రధాన పెట్టుబడిదారుల్లో ఒకటి. 4.77% వాటాతో ఉన్న LICకు ఈ పతనం కారణంగా ₹4,510 కోట్లు నష్టం వాటిల్లింది.

Advertisement

Details

ఇన్వెస్టర్లకు మొత్తం ₹25,209 కోట్లు నష్టం

అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మొత్తం ₹25,209 కోట్లు నష్టం కలిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు 9.41% వాటాతో ఉండగా, వీరికి ₹8,900 కోట్ల మేర దెబ్బ తగిలింది. మొ త్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ పతనం దేశీయ మార్కెట్‌లో భారీ ప్రభావాన్ని చూపుతూ, అన్ని వర్గాల ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా కుదించింది.

Advertisement