Page Loader
దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు
హెచ్‌డీఎఫ్‌సీ విలీనం.. మోర్గాన్‌ స్టాన్లీని దాటేసి..

దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 30, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. జులై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అవుతున్నాయి. అనంతరం ఏర్పడే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 172 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకుల జాబితాలోనూ చేరనుంది. మార్టిగేజ్‌ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకుగా నిలిచిపోనుంది. ఫలితంగా అమెరికా, చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకుల సరసన చేరనుంది. జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌ కో, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తర్వాత స్థానానికి హెచ్‌డీఎఫ్‌సీ చేరిపోనుంది.

DETAILS

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ

విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 12 కోట్ల కస్టమర్లతో అతిపెద్ద బ్యాంక్‌గా నిలువనుంది. బ్యాంకు శాఖల సంఖ్య 8,300 కాగా, ఉద్యోగుల సంఖ్య 1.77 లక్షలకు చేరుకోనుంది. దేశీయంగా అతిపెద్ద బ్యాంకులుగా పేరు గాంచిన ఎస్బీఐ మార్కెట్‌ విలువ 62 బిలియన్‌ డాలర్లు కాగా ఐసీఐసీఐ మార్కెట్‌ విలువ 79 బిలియన్‌ డాలర్లుగా కొనసాగుతోంది. అగ్రికల్చర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, వెల్స్‌ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, మోర్గాన్‌ స్టాన్లీ వంటి బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ తర్వాతి స్థానాల్లో నిలువనుండటం విశేషం. మార్ట్ గేజ్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఖాదారుల్లో 70 శాతం మందికి హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్లు లేవు. వారందరూ ఖాతాలు తెరిస్తే డిపాజిట్లు భారీగా పెరుగుతాయి.