Page Loader
హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా అవాస్తవం : గౌతమ్ అదానీ
హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా అవాస్తవం : గౌతమ్ అదానీ

హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా అవాస్తవం : గౌతమ్ అదానీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2023
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోసపూరిత లావాదేవీలు, స్టార్ ధరల తారుమారు వంటి అవకతవలకు ఆదానీ గ్రూప్ పాల్పడిందంటూ గతంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చింది. అయితే ఆదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన ఈ నివేదికపై మరోసారి గౌతమ్ అదానీ స్పందించారు. ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సమావేశంలో ఆదానీ షేర్ హోల్డర్లను ఉద్ధేశించి మాట్లాడారు. హిండెన్‌బర్గ్ నివేదిక పూర్తిగా అవాస్తమని, నిపుణుల కమిటీ ఎలాంటి ఉల్లంఘనలను గుర్తించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ కమిటీ నివేదికలో షేర్ హోల్డర్లలో విశ్వాసం పెరిగిందని, కృత్రిమ మేధ అన్ని రంగాలను విపరీతంగా ప్రభావితం చేస్తోందన్నారు.

Details

ఉద్ధేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీశారు : అదానీ

అదానీ గ్రూప్‌లో అకౌటింగ్ మోసం, స్టార్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్ బర్గ్ రీసర్చె తన నివేదకలో తీవ్ర ఆరోపణలను చేసింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్‌లు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించలేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొంది.