Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 వరకు అమలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక క్రమశిక్షణను కాపాడటం, అలాగే అమెరికా విధించిన టారిఫ్‌లు వంటి గ్లోబల్ వాణిజ్య ఒత్తిళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలపై దృష్టి పెట్టనుంది.
Details
ఆర్థిక వృద్ధిపై దృష్టి
ఇప్పటి వరకు ఆదాయ పన్ను, జీఎస్టీ కోతలు, మౌలిక సదుపాయాలపై ఖర్చులు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపులు భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌ల ప్రభావాన్ని భారత్ తట్టుకున్నది. అయితే ఈ వృద్ధి ఊపును కొనసాగించేందుకు కొత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. సవాళ్ల మధ్య బడ్జెట్ దేశీయ డిమాండ్ స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గడం సానుకూలం. అయితే అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కమోడిటీ ధరల హెచ్చుతగ్గులు, ప్రధాన కేంద్ర బ్యాంకుల అసమాన వడ్డీ విధానాలు ఆర్థిక భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి.
Details
మధ్యతరగతి కోసం ఆశలు
మధ్యతరగతి ప్రజలు గృహ రుణాలు, ఆరోగ్య బీమా, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయ ఎలక్ట్రానిక్స్‌పై పన్ను రాయితీలను ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియాలపై కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80D తరహా మినహాయింపులు ఇవ్వడం ద్వారా రూ.25,000 నుంచి రూ.50,000 వరకు డిడక్షన్ లభించే అవకాశం ఉంది. అలాగే జీవన రక్షక ఔషధాలు, కీలక వైద్య పరికరాలపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే చికిత్స ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. గృహాల రంగంలోనూ ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచితే ఇల్లు కొనాలనుకునే వారికి భారీ ఊరట లభించనుంది.