OYO: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ నిషేధం.. ఓయో కొత్త పాలసీ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని ప్రకటించింది.
2025లో అమలుకురానున్న ఈ మార్గదర్శకాలు ఓయో హోటల్‌ల్లో రూమ్ బుకింగ్‌కు కొత్త నియమాలను విధించాయి. ఓయో ప్రకారం ఇకపై పెళ్లికాని జంటలు హోటల్ రూమ్‌లు బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండదు.
ఈ నిబంధనలు తొలుత మేరఠ్‌లో అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశముందని ఓయో వెల్లడించింది.
పెళ్లికాని జంటలకు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు తమ పెళ్లి చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాల్సి ఉంటుంది.
వివాహాన్ని నిర్ధారించే ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. భాగస్వామి హోటళ్లకు ఈ పాలసీ అమలు చేయడంపై పూర్తి స్వేచ్ఛను కల్పించింది.
Details
నూతన మార్గదర్శకాలు జారీ
మేరఠ్‌లో తక్షణమే ఈ నిబంధనలను అమలు చేయాలని ఓయో నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఈ మార్పు ఒంటరిగా ప్రయాణం చేసే వ్యక్తులు, విద్యార్థులు, కుటుంబాలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకున్న చర్య అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.
ఈ కొత్త నిర్ణయంతో కస్టమర్ల విశ్వాసం పెరగడంతో పాటు బుకింగ్లలో పెరుగుదల వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయితే వివాహ రుజువుగా చెల్లుబాటు అయ్యే పత్రాలపై స్పష్టత ఇవ్వలేదని వెల్లడించారు.