Stock Market: మార్కెట్లలో భారీ కుదుపు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు మదుపర్లను అప్రమత్తం చేయడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ కాలం నాటి చర్యలను ప్రస్తావించడం, అలాగే యుద్ధం ముగింపుకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించిన శాంతి సూచనలను అమెరికా అధ్యక్షుడు తిరస్కరించడంతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం కూడా దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది.
వివరాలు
సెన్సెక్స్ 961 పాయింట్లు నష్టపోయి 76,365 వద్ద ట్రేడవుతోంది
దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బిఎస్ఇ సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు ప తనమైంది. ఉదయం 9:37 గంటల సమయానికి సెన్సెక్స్ 961 పాయింట్లు నష్టపోయి 76,365 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టి 50 276 పాయింట్లు క్షీణించి 23,903 స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్‌టిపిసి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదే సమయంలో టైటాన్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.