Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.
ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
ఈ వారంలో ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ కారణంగా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800 పాయింట్లు కోల్పోవడం విశేషం. ఇక నిఫ్టీ 23,200 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
Details
లాభాల్లో యాక్సిస్ బ్యాంక్
ప్రారంభ నష్టాల తరువాత, ప్రధాన షేర్లలో కొనుగోలుల మద్దతుతో మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 564 పాయింట్లు తగ్గి 76,841 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 180 పాయింట్లు తగ్గి 23,250 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఎంఅండ్ ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.93 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,714 వద్ద ట్రేడ్ కావడం గమనార్హం.
Details
నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.27 వద్ద ఉంది. గత ట్రేడింగ్ సెషన్‌లో, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు కూడా అదే దిశలో పయనిస్తున్నాయి.
జపాన్ నిక్కీ, ఏఎస్‌ఎక్స్, హాంగ్‌సెంగ్ సూచీలు 1 శాతం మేర నష్టాలను చవిచూశారు.
శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.2,255 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.3,962 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.