Page Loader
India Philanthropy list: ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి అగ్రస్థానంలో శివ్‌నాడార్‌
India Philanthropy list: ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా విడుదల..

India Philanthropy list: ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి అగ్రస్థానంలో శివ్‌నాడార్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ (Shiv Nadar) మరోసారి దాతృత్వంలో ముందువరుసలో నిలిచారు. ఒక ఏడాది వ్యవధిలో ఆయన రూ.2,153 కోట్లను సామాజిక సేవకు కేటాయించారు. ఈ మేరకు ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితాలో ఆయన వరుసగా మొదటి స్థానాన్ని సాధించారు. ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ రెండో స్థానంలో,బజాజ్‌ కుటుంబం మూడో స్థానంలో నిలిచారు. శివ్‌ నాడార్‌ గత ఏడాది రూ.2,042 కోట్ల విరాళం ఇచ్చారు.ఈసారి,గత ఏడాది కంటే 5% అధికంగా విరాళాలు అందించారు. రెండో స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ, రూ.407 కోట్ల విరాళం ఇచ్చారు.గత ఏడాది కంటే 8% ఎక్కువగా విరాళాలు అందించి తన ఉదారతను చాటుకున్నారు.

వివరాలు 

విద్య కోసం పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు 

మూడో స్థానంలో ఉన్న బజాజ్‌ కుటుంబం రూ.352 కోట్లు దాతృత్వం కోసం కేటాయించారు, ఇది గతేడాది కంటే 33% అధికం. ఐదో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ రూ.330 కోట్లను సమాజసేవకు కేటాయించారు. గతేడాది కంటే 16% అధికంగా విరాళాలు ఇచ్చారు. కృష్ణ చివుకుల (7వ స్థానంలో) సుస్మిత అండ్‌ సుబ్రోతో బాగ్చి (9వ స్థానంలో) కూడా తాజాగా హురున్‌ ఇండియా దాతృత్వ జాబితాలో టాప్‌ 10లో చోటు సాధించారు. హురున్‌ ఇండియా దాతృత్వ జాబితాలో టాప్‌ 10 మంది మొత్తం రూ.4,625 కోట్ల విరాళాలను అందించారని నివేదిక వెల్లడించింది. ఇందులో ఆరుగురు వ్యక్తులు ప్రాథమికంగా విద్య కోసం పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినట్లు తెలిపింది.

వివరాలు 

టాప్‌- 10 జాబితా ఇదే 

శివ్‌నాడార్‌ - రూ.2153 కోట్లు ముకేశ్‌ అంబానీ - రూ.407 కోట్లు బజాజ్‌ కుటుంబం - రూ.352 కోట్లు కుమార్‌ మంగళం బిర్లా - రూ.334 కోట్లు గౌతమ్‌ అదానీ - రూ.330 కోట్లు నందన్‌ నీలేకని - రూ.307 కోట్లు కృష్ణ చివుకుల - రూ. 228 కోట్లు అనిల్‌ అగర్వాల్‌ - రూ.181 కోట్లు సుస్మిత, సుబ్రోతో బాగ్చి - రూ.179 కోట్లు రోహిణీ నీలేకని - రూ.154 కోట్లు