LOADING...
Apple Store: హైదరాబాద్‌ వినియోగదారులకు నిరాశ.. యాపిల్​ స్టోర్​ లేనట్టే!
హైదరాబాద్‌ వినియోగదారులకు నిరాశ.. యాపిల్​ స్టోర్​ లేనట్టే!

Apple Store: హైదరాబాద్‌ వినియోగదారులకు నిరాశ.. యాపిల్​ స్టోర్​ లేనట్టే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఆపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది. యాపిల్ తన నాలుగో ఎక్స్‌క్లూజివ్ రీటైల్ స్టోర్‌ను పూణెలో ప్రారంభించనుంది. పూణెలోని కోపా మాల్‌లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ఏర్పాటవుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో స్టోర్ ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై తర్వాత మహారాష్ట్రలో ఇది రెండో యాపిల్ స్టోర్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం యాపిల్‌కు ముంబై, న్యూ దిల్లీలో ఇప్పటికే స్టోర్లు ఉన్నాయి.మూడో స్టోర్ బెంగళూరులో ప్రారంభం కానుందని కంపెనీ ముందే ధృవీకరించింది. అయితే కోల్‌కతా, చెన్నై లేదా హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేస్తారని ముందుగా ప్రచారం వచ్చినా, ఇప్పుడు ఆ అవకాశం పూణెకు మారింది.

Details

బెంగళూరు స్టోర్ పూర్తి వివరాలు

పూణె స్టోర్‌ ప్రారంభోత్సవానికి అమెరికా నుంచి యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరుకానున్నట్టు సమాచారం. ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ లాంచ్ కూడా జరగనున్నందున, పూణె స్టోర్‌ ఓపెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బెంగళూరులో ప్రారంభమయ్యే స్టోర్‌పై పూర్తి సమాచారం ఇప్పటికే యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బళ్లారి రోడ్, బైతరాయనపురలోని 'ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా'లో ఈ స్టోర్ ఏర్పాటవుతోంది. 'యాపిల్ హెబ్బాల్' అని పేరు పెట్టిన ఈ ఔట్‌లెట్‌లో ముంబై, ఢిల్లీ స్టోర్లలో లభించే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Details

 భారత మార్కెట్‌పై యాపిల్ దృష్టి 

కస్టమర్లకు సహాయం చేయడానికి యాపిల్ స్పెషలిస్టులు, రిపేర్ల కోసం జీనియస్ బార్, ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చే టుడే ఎట్ యాపిల్ సెషన్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సెషన్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశమూ ఉంది. అంతేకాకుండా, కొత్త ఉత్పత్తులపై ఉచిత ఎన్‌గ్రేవింగ్ (చెక్కించే) సేవ కూడా ఇక్కడ లభ్యం కానుంది. గత కొన్నేళ్లుగా యాపిల్ భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. చైనాపై ఆధారపడకుండా, భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేయడమే కాక, ఇండియాను ఒక ప్రధాన మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చుకోవడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశ్యం.