LOADING...
Hyundai: 2030 నాటికి భారతదేశంలో హ్యుందాయ్ ₹45,000 కోట్లు భారీ పెట్టుబడి 
2030 నాటికి భారతదేశంలో హ్యుందాయ్ ₹45,000 కోట్లు భారీ పెట్టుబడి

Hyundai: 2030 నాటికి భారతదేశంలో హ్యుందాయ్ ₹45,000 కోట్లు భారీ పెట్టుబడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా (HMIL) 2026 నుంచి 2030 వరకు ₹45,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. కంపెనీ మొత్తం పెట్టుబడిలో 60 శాతం భాగాన్ని కొత్త ఉత్పత్తుల అభివృద్ధి,రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (R&D) కోసం, మిగిలిన 40 శాతం భాగాన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, అప్‌గ్రేడ్ చేయడం కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది. దీని భాగంగా HMIL 2030 వరకు 26 కొత్త మోడల్స్ లాంచ్ చేయనుంది. ఇందులో ఏడు పూర్తిగా కొత్త ఉత్పత్తులు, ఆరు ఫుల్ మోడల్ చేంజ్‌లు, ఆరు వేరియంట్లు, ఏడు ఫేస్‌లిఫ్ట్‌లు/ప్రోడక్ట్ ఎన్‌హాన్స్‌మెంట్స్ ఉంటాయి. వీటిలో ఐదు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఎనిమిది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (HEVs) కూడా ఉంటాయి.

వివరాలు 

లగ్జరీ బ్రాండ్ జెనేసిస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్న హ్యుందాయ్ 

కంపెనీ 2030 లో MPV, ఆఫ్-రోడర్ SUV సెగ్మెంట్స్ లో కూడా ప్రవేశించనుంది. అలాగే, ఇండియాలో తయారు చేయబడిన మొదటి కంపాక్ట్ EV SUV ను లాంగ్ రేంజ్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) తో లాంచ్ చేయడానికి సన్నాహాలు ఉన్నాయి. ఇవన్నీ హ్యుందాయ్ భారతీయ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో వాటా పెంచడానికి తీసుకుంటున్న వ్యూహాలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా, హ్యుందాయ్ తన లగ్జరీ బ్రాండ్ జెనేసిస్ (Genesis) ను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. జెనేసిస్ కింద భారతంలో మొదటి ప్రొడక్షన్ మోడల్ 2027 లో లాంచ్ చేయనుంది.

వివరాలు 

ఆమోదం పొందిన MD వారసత్వ ప్రణాళిక 

అంతే కాకుండా, HMIL బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ (MD) స్థానంలో సక్సెషన్ ప్లాన్ ను ఆమోదించింది. ప్రస్తుతం హోల్-టైమ్ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ గార్గ్, 2026 జనవరి 1 నుండి MD & CEO గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ఉన్సూ కిమ్ స్థానంలో చేరుతున్నారు, 2025 డిసెంబర్ 31 తర్వాత హ్యుందాయ్ మోటార్ కంపెనీలో దక్షిణ కొరియాకు వ్యూహాత్మక పాత్ర కోసం వెళ్లనున్నారు.