
దుమ్ములేపుతున్న ఐడియాఫోర్జ్ ఐపీఓ.. వారందరికీ లాభాలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ దుమ్మురేపింది.
శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లో ఈ ఐడియా ఫోర్జ్ ఐపీఓ బంపర్ లిస్టింగ్ జరిగింది. దీంతో ఎన్ఎస్ఈలో ఏకంగా 93.5శాతం ప్రీమియంతో రూ.1,300 వద్ద లిస్ట్ అయ్యింది.
అదే విధంగా బీఎస్ఈలో రూ.1,350.10 వద్ద అడుగుపెట్టడం విశేషం. ఈ డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ప్రైజ్ బ్రాండ్ రూ.638, రూ.672 గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఓ అలాట్ అయిన మదుపర్లకు భారీ లాభాలు దక్కే అవకాశం ఉంది.
అయితే మదుపర్లు ఇక్కడ తమ ప్రాఫిట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పొజిషన్లు ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే స్టార్ ఇప్పటికే భారీ ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.
Details
ప్రాడక్ట్ డెవలప్మెంట్కు నిధులను ఉపయోగించనున్న సంస్థ
ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ప్రాఫిట్స్‌ను బుక్ చేసుకోవడం ఉత్తమం అని, అగ్రెసివ్ ఇన్ వెస్టర్లు మాత్రం ఈ స్టాకును రూ.1,170 టార్గెట్ వరకు హోల్డ్ చేయవచ్చని స్వాస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్ అనుభూతి మిశ్ర తెలిపారు.
ఈ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ జూన్ 26న ఓపెన్ అయ్యి, జూన్ 30తో ముగియనుంది. చివరి రోజున 50.30 రెట్లు అధికంగా సబ్ స్క్రైబ్ అవ్వడంతో, లిస్టింగ్ కూడా భారీ లాభాల్లో జరుగుతుందని అంతా భావించారు. రిటైల్ ఇన్ వెస్టర్ల విభాగం 64.48 రెట్లు అధికంగా సబ్ స్క్రైవ్ అవ్వడం గమనార్హం.
ఐపీఓ ద్వారా సమకూర్చిన నిధులను అప్పులు తీర్చుకునేందుకు, ప్రాడక్ట్ డెవలప్మెంట్కు సంస్థ ఉపయోగించనుంది.