Financial Habits : ఈ 5 ఫైనాన్స్ టిప్స్ పాటించకపోతే.. 30 తర్వాత అప్పుల్లో కూరుకుపోవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
చాలా మంది డబ్బు సంపాదించినా వాటిని సమర్థంగా ఉపయోగించలేకపోతున్నారు.
ఖర్చులను నియంత్రించకపోతే అప్పుల భారం పెరిగి, సిబిల్ స్కోరు ప్రభావితం అవుతుంది.
భవిష్యత్తులో రుణం తీసుకోవాలనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే 30 ఏళ్లలోపు కొన్ని అలవాట్లు చేసుకుంటే ఆర్థికంగా భద్రతతో ఉండవచ్చు.
1. సిబిల్ స్కోరుపై కంట్రోల్
రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించకపోతే, సిబిల్ స్కోరు పడిపోతుంది. ఈ స్కోరు మెరుగుపరచుకోవాలంటే, అన్ని బిల్లులు, లోన్ ఈఎంఐలు సమయానికి చెల్లించాలి.
చెల్లింపులను డిఫాల్ట్ చేయకుండా చూసుకోవాలి. మంచి సిబిల్ స్కోరు భవిష్యత్తులో రుణాల కోసం చాలా ఉపయోగపడుతుంది.
Details
2. ఖచ్చితమైన బడ్జెట్ తయారీ
మీ జీతం ఎంత ఉన్నా, ఖర్చులను నియంత్రించేందుకు బడ్జెట్ వేసుకోవాలి.
అవసరానికి మించి ఖర్చు చేయకుండా, ప్రతినెలా ఎంత ఖర్చు అవుతుందనే లెక్క ఉంచుకోవడం అవసరం.
బడ్జెట్ లేకుండా ఖర్చు చేస్తే, అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంటుంది.
3. ఎమర్జెన్సీ ఫండ్
ఏర్పాటు ప్రతీ నెలా కొంత మొత్తం ఎమర్జెన్సీ ఫండ్‌కు కేటాయించడం అలవాటు చేసుకోవాలి.
అకస్మాత్తుగా డబ్బు అవసరమైనపుడు ఇతరుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇది బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా భద్రంగా ఉంటుంది.
Details
4. లావాదేవీలపై నిఘా
మీరు ఎంత సంపాదించినా, ఖర్చులను గమనించడం ఎంతో అవసరం.
బ్యాంక్ ఖాతాలో డబ్బు ప్రవాహాన్ని తరచూ చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఖర్చు పెరుగుతుందో అర్థం చేసుకొని, అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.
ఈ అలవాటు ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
5. పెట్టుబడి అలవాటు
డబ్బు సంపాదించడం ప్రారంభించిన వెంటనే, చిన్న చిన్న పెట్టుబడులు ప్రారంభించాలి.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక పెట్టుబడులు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
ఇల్లు, కారు కొనుగోలు, పిల్లల విద్య వంటి లక్ష్యాలకు ముందుగా సన్నద్ధం కావచ్చు.