LOADING...
TCS: ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!
ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!

TCS: ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి) ఉద్యోగుల సంఖ్యను 2 శాతం మేర తగ్గించనుందని ప్రకటించింది. ఈ మేరకు దాదాపు 12,200 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు టీసీఎస్‌ సీఈవో కే. కృతివాసన్‌ తెలిపారు. 'మనీ కంట్రోల్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని టీసీఎస్‌ శాఖల్లో ఈ ఉద్యోగాల కోత అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఏఐ, నూతన ఆపరేటింగ్ మోడల్స్‌ వంటి సాంకేతిక పరిణామాల నేపథ్యంలో సంస్థను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవాలన్నదే ఈ నిర్ణయ వెనుక ఉద్దేశమని ఆయన వివరించారు. పనిచేసే తీరులో మార్పులు వస్తున్నాయి.

Details

సీనియర్ ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం

అందులో భాగంగా భవిష్యత్తు అవసరాలను గుర్తించి, ఏఐ ఆధారంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలను మేం మదింపు చేస్తున్నాం. ఇప్పటికే ఉద్యోగుల కెరీర్ వృద్ధికి మేం భారీగా పెట్టుబడి పెట్టాం. కానీ కొన్ని రోల్స్‌లో ఇది సరైన ఫలితాలు ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఈ ఉద్యోగాల కోత ప్రధానంగా మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అయితే ఇది సంస్థకు తీసుకోవాల్సిన చాలా కఠిన నిర్ణయాలలో ఒకటిగా పేర్కొన్నారు కృతివాసన్‌. లేఆఫ్‌ అయిన ఉద్యోగులకు తగిన మద్దతు అందించేందుకు టీసీఎస్‌ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌లో మొత్తం 6,13,000 మంది ఉద్యోగులున్నారు. అందులో 2 శాతం కోత అంటే సుమారుగా 12,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా.