
e-Visa: భారతీయుల విదేశీ ట్రావెల్‌లో ఈ-వీసాల ప్రభావం.. 82 శాతం వీసాలే ఇప్పుడు ఆన్‌లైన్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయుల విదేశీ ప్రయాణాల విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వీసా కోసం సుదీర్ఘ నిరీక్షణలో ఉండే కష్టాల కారణంగా, ఎక్కువ మంది ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అందే ఎలక్ట్రానిక్ వీసాలు (ఈ-వీసాలు) వైపు మొగ్గుచూపుతున్నారు. 2025లో భారతీయులు సమర్పించిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 82 శాతం ఈ-వీసాలే ఉన్నాయని వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ 'అట్లిస్' బుధవారం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది 2024లో 79 శాతంగా ఉండగా, కేవలం ఒక్క ఏడాదిలో గణనీయమైన పెరుగుదల సాధించింది. నివేదిక ప్రకారం, భారతీయుల రాకపోకను పెంచడానికి అనేక దేశాలు వీసా విధానాలను సులభతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఏఈ, వియత్నాం, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, ఈజిప్ట్ దేశాలు భారతీయుల ఇష్టమైన ఈ-వీసా గమ్యస్థానాలుగా నిలిచాయి. '
Details
భారతీయ ప్రయాణికులు వేగానికి ప్రాధాన్యాత ఇస్తారు
అట్లిస్' వ్యవస్థాపకుడు, సీఈఓ మోహక్ నహతా వ్యాఖ్యానించారు, భారతీయ ప్రయాణికులు వేగం, కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ-వీసాలు ఈ రెండు లక్షణాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో వేగంగా అనుమతులు లభించడం వల్ల చివరి నిమిషంలో చేసే ప్రయాణాలు కూడా సులభతరం అవుతున్నాయి. డిజిటల్ వీసా విధానాలను అవలంబించిన దేశాలు ఇప్పటికే భారత్ నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ-వీసాల ప్రభావం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. శ్రీలంక విషయంలో దరఖాస్తుల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో ఏడు రెట్లు పెరిగింది. జార్జియాకు వెళ్లే భారతీయుల సంఖ్య 2.6 రెట్లు పెరిగింది.
Details
అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సౌకర్యవంతం
ఇది పర్యాటకులు సంప్రదాయ గమ్యస్థానాలపాలన కాకుండా కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నారని సూచిస్తుంది. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా, యూరప్ సహా 50కిపైగా దేశాలు భారతీయులకు ఈ-వీసాలు లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్లు (ఈటీఏ) అందిస్తున్నాయి. ఆసియాలో శ్రీలంక, వియత్నాం, జపాన్, సింగపూర్ ప్రధానంగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మార్పుల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారుతున్నాయి.