
MRP: జీఎస్టీ స్లాబ్ మార్పు ప్రభావం.. పాత స్టాక్‌కి కొత్త ఎమ్మార్పీ
ఈ వార్తాకథనం ఏంటి
తయారీదారుల వద్ద నిల్వగా ఉన్న పాత స్టాక్‌పై గరిష్ఠ రిటైల్ ధర (MRP) సవరించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో వినియోగదారులు కొత్త స్టాక్ మార్కెట్లోకి రాకముందే, పాత స్టాక్‌ను సవరించిన ధరతో కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు నేరుగా ఆర్థిక లాభం కలగనుంది. ఇటీవల జీఎస్టీ రేట్లు తగ్గించడంతో మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై కూడా కొత్త జీఎస్టీ రేట్లను అన్వయించే అవకాశం ఏర్పడింది. అందువల్ల తయారీదారులు పాత స్టాక్ ధరలను సవరించి, తగ్గిన రేట్ల వల్ల కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
Details
ఈనెల 22 నుంచి అమల్లోకి
మారిన జీఎస్టీ స్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో వినియోగదారులు కొత్త ఉత్పత్తులు వచ్చేవరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, తగ్గిన ధరలతోనే పాత స్టాక్‌ను కొనుగోలు చేయగలుగుతారు.