Stock Market: పన్ను నిర్ణయాల ప్రభావం.. కుదేలైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్‌లో చేసిన కీలక ప్రకటనలు దేశీయ స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కంపెనీల షేర్ బైబ్యాక్‌పై పన్ను విధించడం, అలాగే కమోడిటీ ఫ్యూచర్స్ లావాదేవీలపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంపు మార్కెట్లను కుదిపేశాయి. ఈ పరిణామాలతో దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,367 పాయింట్లు క్షీణించి 80,675 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 535 పాయింట్లు పడిపోయి 24,785 వద్ద కదలాడుతోంది.
Details
జోరుగా కొనసాగుతున్న అమ్మకాలు
ఒక దశలో మార్కెట్లలో మరింతంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 2,000 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా క్షీణించిన స్థాయికి చేరాయి. బడ్జెట్‌లో తీసుకున్న పన్నుల నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచడంతో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే బడ్జెట్ ప్రకటనల అనంతరం మార్కెట్లు స్పష్టమైన ఒడిదుడుకులకు లోనవుతూ భారీ ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.