LOADING...
Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు రోజంతా ఒత్తిడిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకు పతనమై పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. నేటి ట్రేడింగ్‌ను మార్కెట్లు బలహీనంగానే ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 76,224 పాయింట్ల వద్ద ప్రారంభమై, చివరకు 479 పాయింట్లు కోల్పోయి 76,009 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 118 పాయింట్లు తగ్గి 23,913 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, టీఎంపీవీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎటర్నల్ షేర్లు లాభాల్లో నిలిచాయి.

వివరాలు

నష్టాల్లో అపోలో హాస్పిటల్స్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్

అయితే అపోలో హాస్పిటల్స్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 95.73 వద్ద ముగిసింది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలతో గత ట్రేడింగ్ సెషన్‌లో భారత మార్కెట్లు రెండు వారాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. అయితే ఆ ఆశలకు అమెరికా దాడుల పరిణామాలు గండికొట్టడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాల ప్రభావంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియడంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం భారత మార్కెట్లపై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చింది.

Advertisement