ITR filinig: బిలేటెడ్ ఐటీఆర్‌ల దాఖలుకు గడువును పెంచిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) బిలేటెడ్/ రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు గడువును పొడిగించింది.
డిసెంబరు 31తో గడువు ముగియాల్సిన సందర్భంలో, భారత నివాసితులకు 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించింది.
జులైలో ఐటీఆర్ దాఖలు చేయని వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అలాగే, గడువు ముగియకముందే ఐటీఆర్ సమర్పించినవారూ అవసరమైతే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
2023-24 ఆర్థిక సంవత్సరం (మదింపు సంవత్సరం 2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు ఈ ఏడాది జులై 31తో ముగిసింది.
వివరాలు
గడువు జనవరి 15 వరకు..
రిటర్నులను దాఖలు చేయకపోయిన వారికి చట్టం చివరి అవకాశాన్ని ఇస్తుంది. ఆగస్టు 1 నుంచి డిసెంబరు 31 మధ్య దాఖలు చేసిన రిటర్నులను బిలేటెడ్ రిటర్న్‌గా పరిగణిస్తారు.
బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసే వ్యక్తుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, అంతకు మించి ఉంటే రూ.5,000 వరకూ జరిమానా విధించబడుతుంది.
తాజా పొడిగింపు ప్రకారం, ఈ గడువు జనవరి 15 వరకు పెంచబడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే వ్యాపార నష్టాలు, మూలధన నష్టాలను వచ్చే సంవత్సరాలకు సర్దుబాటు చేసే అవకాశం కోల్పోతారు.
ఐటీఆర్ రిటర్నులు కొత్త పన్ను విధానంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.