GST increase: జీఎస్టీ పెంపుతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై పెరిగిన ఒత్తిడి
ప్రస్తుతం భారతదేశంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు జరిగింది. ఒకప్పుడు సొంత బైక్ లేదా కారు కలిగి ఉండడం ప్రజల కోరికగా ఉండేది. కానీ ఇప్పుడు సొంతంగా కార్లను కొనుగోలు చేయాలని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. కుటుంబంతో కలిసి బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించకూడదు అనే ఆలోచనతో, ఒక కారు ఉంటే అందరూ హాయిగా ప్రయాణించగలరనే ఆశతో మార్కెట్లో తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం జనాలు శోధిస్తున్నారు. అయితే కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థోమత లేని వాళ్లకు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడం సాధ్యం అవుతోంది. .
గతంలో 12 శాతం
భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఇప్పుడు చాలా పెద్దది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం సెకండ్ హ్యాండ్ కార్లపై 18 శాతం జీఎస్టీని పెంచింది. ఈ పెంపుదలతో ముందుగా 12 శాతం ఉన్న జీఎస్టీ ప్రస్తుతం 18 శాతానికి పెరిగింది. అయితే ఇది జీఎస్టీత కింద నమోదు కాని వ్యక్తుల మధ్య వాహనాల అమ్మకానికి వర్తించదు. జీఎస్టీ కింద నమోదు చేసిన వ్యక్తులు మాత్రమే ఈ పెరిగిన పన్నును చెల్లించాలి. గతంలో సెకండ్ హ్యాండ్ కార్లను డీల్‌ర్స్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండేది.
55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం
ఇప్పుడు, ఈ జీఎస్టీ రేటు పెరిగి 18 శాతానికి చేరడంతో, కార్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇది షాక్ ఇచ్చే అంశంగా మారింది. 21 డిసెంబర్ 2023న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్ను పెంపుతో జీఎస్టీ కింద నమోదు చేసిన డీల్‌ర్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు జరగడానికి మరింత ఒత్తిడి ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ డీల్‌ర్స్ ఈ మార్పులతో ప్రభావితమయ్యాయి. ఇప్పటికే స్పిన్నీ, కార్స్24 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలలో ప్రధానంగా ఉన్నాయి. కాగా పెరిగిన జీఎస్టీ వలన అనధికార మార్గాల ద్వారా కార్ల కొనుగోలును తట్టుకోలేకుండా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కార్ల ఎక్స్ఛేంజీల సంఖ్య తగ్గే అవకాశం
డీలర్‌షిప్‌లు కాకుండా వ్యక్తిగతుల మధ్య కార్ల కొనుగోలు, అమ్మకాలు పెరుగుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. 30 శాతం మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగుల ద్వారా వాహనాలు కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేస్తున్నారు. కాగా, కేవలం 10 శాతం మాత్రమే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. పెరిగిన జీఎస్టీ వల్ల షోరూమ్‌లలో సెకండ్ హ్యాండ్ కార్ల ఎక్స్ఛేంజీల సంఖ్య తగ్గిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు.