LOADING...
India: ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ
ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ

India: ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థితిగతులపై ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. 2024లో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్, 2025 నాటికి ఒక మెట్టు దిగి ఆరో స్థానానికి చేరింది. అయితే ఈ వెనుకడుగు శాశ్వతం కాదని, తాత్కాలిక పరిణామమేనని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందున్న కాలంలో భారత్ తన పురోగతి యాత్రను మరింత వేగంగా కొనసాగిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను ఆర్థిక పరిశోధన సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, బ్రిటన్ మళ్లీ ఐదో స్థానాన్ని దక్కించుకోవడంతో భారత్ ఆరో స్థానానికి చేరాల్సి వచ్చింది.

వివరాలు 

భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయి: నివేదిక  

రూపాయి విలువలో వచ్చిన మార్పులు, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో జరిగిన పరిణామాలు ఈ మార్పుకు కారణాలుగా నిలిచాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయని నివేదిక స్పష్టంగా పేర్కొంది. 2024 నుంచి 2029 వరకు భారత్ సగటున 6.4శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2031 నాటికి జపాన్,జర్మనీ దేశాలను వెనక్కి నెట్టి, అమెరికా,చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈదిశగా తయారీ రంగం,సేవల రంగం బలోపేతం చేయడం అత్యంత అవసరం. మౌలిక సదుపాయాల అభివృద్ధి,డిజిటల్ రంగంలో జరుగుతున్న మార్పులు ఈ వృద్ధికి ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి.

వివరాలు 

భవిష్యత్తులో అగ్రదేశాల సరసన భారత్ నిలబడటం ఖాయం

రాబోయే పదేళ్లలో భారత్ కేవలం మూడో స్థానానికి మాత్రమే పరిమితం కాకుండా, 2038 నాటికి పది ట్రిలియన్ డాలర్ల స్థాయి ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. దేశ జనాభా నిర్మాణం, పెరుగుతున్న మధ్యతరగతి వినియోగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మారుస్తున్నాయి. తాత్కాలికంగా ఆరో స్థానానికి పడిపోయినా, భవిష్యత్తులో అగ్రదేశాల సరసన భారత్ నిలబడటం ఖాయం అనే నమ్మకాన్ని ఈ నివేదిక వ్యక్తం చేస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడో స్థానంపై కన్నేసిన దేశం

Advertisement