'ఓవర్ వెయిట్' లో మార్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు.. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్ లో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ 'మోర్గాన్ స్టాన్లీ' సంచలన మార్పులను చేసింది. భారత రేటింగ్ మెరుగుపర్చి ఓవర్ వెయిట్ గా పేర్కొనడం విశేషం.
దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల అజెండా మూలధన వ్యయాలు, లాభాల విషయంలో సానుకూల దృక్పథంలో ముందుకెళ్తుతోందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. అదే విధంగా చైనా రేటింగ్ ను ఈక్వల్ వెయిట్ ను తగ్గించింది.
సంస్కరణలు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉందని, ముఖ్యంగా దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేసిందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో స్పష్టం చేసింది.
Details
చైనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకు హెచ్చరిక
కొన్ని నెలల క్రితం మోర్గాన్ స్టాన్లీ భారత్ రేటింగ్ ను అండర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్ ను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని మరింత పెంచి ఓవర్ వెయిట్ కేటగిరిలోకి చేర్చారు.
అయితే చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడం, అమెరికా రుణ రేటింగ్ ను ఫిచ్ తగ్గించిన సమయంలోనే మోర్గాన్ స్టాన్లీ భారత్ రేటింగ్ పెంచడంపై ప్రాధాన్యం సంతరించుకుంది.
ఓవర్ వెయిట్ రేటింగ్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని అంచనా వేస్తూ మోర్గాన్ స్టాన్లీ ఈ రేటింగ్ అందించింది.
మరోవైపు చైనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకు తెలిపింది.