LOADING...
India-US Trade: ఆరు నెలల తర్వాత భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం
ఆరు నెలల తర్వాత భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం

India-US Trade: ఆరు నెలల తర్వాత భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రాబోయే వారాల్లో కీలక వాణిజ్య చర్చలకు సిద్ధమవుతోంది. ఆరు నెలల తర్వాత అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అలాగే న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, కెనడాతో ముఖాముఖి చర్చలు కూడా అజెండాలో ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియాతో 2010లో కుదిరిన సీఈపీఏ ఒప్పందాన్ని పునఃసమీక్షించేందుకు వేగం పెంచనుంది.

వివరాలు 

యూకేతో కుదిరిన సీటీఏ ఒప్పందం మేలో అమల్లోకి..

ఈ నేపథ్యంలో కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ భారత్‌ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ, సెమీకండక్టర్లు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇదే సమయంలో భారత ప్రతినిధి బృందం అమెరికాలో మూడు రోజుల చర్చల్లో పాల్గొని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని చూస్తోంది. అలాగే ఏప్రిల్‌ 27న న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏ, మేలో కెనడాతో చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే యూకేతో కుదిరిన సీటీఏ ఒప్పందం మేలో అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ పరిణామాలన్నీ గ్లోబల్‌ వాణిజ్యంలో భారత్‌ స్థాయిని మరింత బలపరుస్తున్నాయి.

Advertisement