Page Loader
UPI: ఈ రెండు దేశాలలో ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
ఈ రెండు దేశాలలో ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ

UPI: ఈ రెండు దేశాలలో ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రతి రెండో వ్యక్తి యూపీఐను ఉపయోగిస్తున్నారు. UPI సాంకేతికత కేవలం భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా విస్తరిస్తోంది. అనేక దేశాలు భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన UPIని అమలు చేయడం ప్రారంభించాయి. త్వరలో ఈ వ్యవస్థను ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా ప్రారంభించనున్నారు. NPCI, NIPL (NPCI International Payments Limited) ద్వారా పెరూ, నమీబియా వంటి దేశాల కేంద్ర బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని, UPI వంటి వ్యవస్థను ఆ దేశాల్లో ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రూపొందించింది.

వివరాలు 

ఈ దేశాల్లో UPI ఎప్పుడు ప్రారంభమవుతుంది?

UPI ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్నకు, NIPL CEO రితేష్ శుక్లా ప్రకారం,భారత్ ఇప్పటికే ఆఫ్రికా,దక్షిణ అమెరికా దేశాలకు UPI బ్లూప్రింట్లను అందించడానికి సిద్ధంగా ఉంది. 2027 నాటికి పెరూ,నమీబియాలో UPI అమలు కావొచ్చని తెలుస్తోంది.NPCI భారతదేశంలో రిటైల్ చెల్లింపుల వ్యవస్థను నియంత్రించే సంస్థ,ఇది దేశీయంగా UPIని అమలు చేస్తుంది. ఆగస్టు నెలలో 15బిలియన్ల UPI లావాదేవీలు జరిగాయి.NPCI ఆధ్వర్యంలోనే NIPL రూపొందించబడింది. ఇది భారతదేశపు UPIని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది.NIPL ప్రస్తుతం ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని 20దేశాలతో చర్చలు జరుపుతోంది. వీటిలో పెరూ,నమీబియా సెంట్రల్ బ్యాంక్‌లు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో UPI ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వివరాలు 

ఇప్పటివరకు 7 ఒప్పందాలు..

UPI ప్రాజెక్ట్ గురించి రువాండాతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.అయితే, రువాండా బ్యాంక్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. రితేష్ శుక్లా ప్రకారం, NIPL ఇతర దేశాల రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థలతో భాగస్వామ్యాన్ని కూడా పెంచుకుంటోంది, వీటిలో సింగపూర్‌కు చెందిన పెనౌ కూడా ఉంది. ఇప్పటివరకు 7 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం NIPLలో 60 మంది సభ్యులు ఉన్నారు, అయితే 2025 మార్చి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. సంస్థ సింగపూర్,మధ్య ప్రాచ్య దేశాలలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.