Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై అమెరికా చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది, గత పది సంవత్సరాలలో భారతదేశం గణనీయంగా వృద్ధి సాధించిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. భారత్ ఇంకా తన పూర్తిస్థాయిలో శక్తి సామర్థ్యాలను అందుకోలేకపోతోందని, గత తొమ్మిదేళ్లుగా వ్యవస్థాగతంగా వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న భారతదేశం..2013లో ఉన్నదానికి భిన్నంగా ఉందని నివేదిక పేర్కొంది. జీడీపీలో డిజిటల్ లావాదేవీల శాతం గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణకు దోహదం చేసినట్లు వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థ
ముఖ్యంగా 2014 నుంచి విధాన మార్పుల కారణంగా గత పది సంవత్సరాల కాలంలో భారతదేశంలో 10 ముఖ్యమైన మార్పులను గుర్తించడం విశేషం. 1.సరఫరా వైపు విధాన సంస్కరణలు 2. ఆర్థిక వ్యవస్థ యొక్క అధికారికీకరణ 3. రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం 4. సామాజిక బదిలీలను డిజిటలైజ్ చేయడం 5. దివాలా ,దివాలా కోడ్ 6. సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్యం 7. ఎఫ్‌డీఐపై దృష్టి 8. భారతదేశం 401(కే) పదవీ విరమణ పొదుపు ప్రణాళిక 9. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ మద్దతు 10. బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి ఎంఎన్‌సీ సెంటిమెంట్ భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది, బలమైన విజయాన్ని సాధించగలదని మోర్గాన్ స్టాన్లీ ధ్రువీకరించింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి