LOADING...
India's Defence Production: భారత్ రక్షణ రంగంలో కొత్త రికార్డు.. రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!
రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!

India's Defence Production: భారత్ రక్షణ రంగంలో కొత్త రికార్డు.. రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో రూ.1.78లక్షల కోట్లకు చేరింది. కేవలం ఐదేళ్లలోనే ఇది 110శాతంపెరగడం విశేషం.దీంతో ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్,ఇప్పుడు రక్షణ సామగ్రి తయారీ కేంద్రంగా ఎదిగే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. బుధవారం రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1.54లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 15.6శాతం వృద్ధి నమోదైంది. 2013-14లో నమోదైన ఉత్పత్తితో పోలిస్తే ఇది దాదాపు నాలుగురెట్లు అధికం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ వృద్ధి చోటుచేసుకుంది.

వివరాలు 

రక్షణ సామగ్రి కొనుగోలుదారు నుంచి తయారీదారుగా భారత్

దశాబ్దాలుగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు, ఆధునిక ఆయుధాల కోసం భారత్ విదేశాలపై ఆధారపడేది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మారడం,సరఫరా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తడంతో స్వదేశీ తయారీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగంలో స్వదేశీ పరిశోధనలు,రూపకల్పన, తయారీ సామర్థ్యాలను పెంచేందుకు అనేక సంస్కరణలు చేపట్టింది. వాటి ఫలితంగా 2020-21లో రూ.84,643 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి విలువ, 2025-26 నాటికి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. విమాన తయారీ, క్షిపణులు, నౌకాదళ వ్యవస్థలు, సాయుధ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, మందుగుండు సామగ్రి తయారీలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.

వివరాలు 

ప్రైవేటు రంగం పాత్ర పెరుగుతోంది

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ రక్షణ పరిశ్రమకు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. విధానపరమైన సంస్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యం, స్వదేశీ సామర్థ్యాల పెంపు వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భారత్ రక్షణ తయారీ రంగంలో ప్రైవేటు సంస్థల పాత్ర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం రక్షణ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థలు 76 శాతం వాటా కలిగి ఉండగా, ప్రైవేటు రంగం వాటా 24 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇది 22 శాతంగా ఉంది. 2025-26లో ప్రైవేటు కంపెనీలు సుమారు రూ.42 వేల కోట్ల విలువైన రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసి కొత్త రికార్డు సృష్టించాయి.

Advertisement

వివరాలు 

రికార్డు స్థాయికి చేరిన రక్షణ ఎగుమతులు

భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు), స్టార్టప్‌లు కూడా విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, విమాన రంగ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుదలతో పాటు రక్షణ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2025-26లో భారత్ రూ.38,424 కోట్ల విలువైన రక్షణ సామగ్రిని విదేశాలకు ఎగుమతి చేసి మరో రికార్డు నెలకొల్పింది. భారత తయారీ ఆయుధాలు,రక్షణ పరికరాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో రక్షణ ఎగుమతులు కీలక సూచికగా మారాయి. దేశీయ అవసరాలను ప్రభుత్వ విధానాలతో తీర్చవచ్చుగానీ,విదేశీ మార్కెట్లలో నిలదొక్కుకోవడం ద్వారా మాత్రమే ఉత్పత్తుల నాణ్యత, సాంకేతిక సామర్థ్యం, అంతర్జాతీయ పోటీతత్వం నిరూపితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ప్రపంచ రక్షణ రంగంలో భారత్‌కు కొత్త అవకాశాలు

భవిష్యత్తులో రక్షణ ఎగుమతులను మరింత పెంచి ప్రపంచ రక్షణ తయారీ రంగంలో భారత్‌ను కీలక దేశంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరుగుతున్న సమయంలో భారత్ ఈ ఘనత సాధించింది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం,2025లో ప్రపంచ రక్షణ వ్యయం 2.9శాతం పెరిగి 2.887ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా 11వఏడాది కూడా ప్రపంచ దేశాలు రక్షణ రంగంపై అధికంగా ఖర్చు చేస్తున్నాయి. చైనా,పాకిస్థాన్‌తో ఉన్న భద్రతా సవాళ్లు,సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కూడా తన రక్షణ వ్యవస్థలను ఆధునీకరిస్తోంది. 2025లో దేశ రక్షణ వ్యయం 8.9 శాతం పెరిగి 92.1బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసే తొలి ఐదుదేశాల్లో భారత్ స్థానం సంపాదించింది.

వివరాలు 

ప్రపంచ రక్షణ రంగంలో భారత్‌కు కొత్త అవకాశాలు

ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక పోటీ, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ప్రపంచ రక్షణ పరిశ్రమకు కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయి. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని, రక్షణ సామగ్రిని కొనుగోలు చేసే దేశం నుంచి ప్రపంచానికి ఆయుధాలను తయారు చేసి ఎగుమతి చేసే శక్తిగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Advertisement