
GDP growth: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని తాజా ఆసియాన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో 7.8 శాతానికి చేరిన జీడీపీ వృద్ధి, ద్వితీయార్ధంలో కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో మెరుగైన వినియోగం, ప్రభుత్వ వ్యయం కారణంగా జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతం నమోదు అయ్యింది. అయితే, అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం ఎగుమతులపై పడనుంది,
Details
వచ్చే ఏడాదిలో కొంతమేర తగ్గనుంది
అందువల్ల ఆర్థిక సంవత్సరంలోని రెండోభాగంలో, వచ్చే ఏడాదిలో వృద్ధిరేటు కొంతమేర తగ్గనుంది. అయితే స్థిరమైన దేశీయ డిమాండ్, సేవారంగ ఎగుమతులు సుంకాల ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని నివేదికలో పేర్కొంది. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం, వాటి జీడీపీలో వాటా తక్కువగా ఉండటం కలిపి వృద్ధి రేటుపై పరిమిత ప్రభావం చూపుతుంది. ఇంకా బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 4.4 శాతం ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే జీఎస్టీ కోతల గురించి ఇందులో ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ కోతల వల్ల పన్ను ఆదాయం కొంతమేర తగ్గి, ద్రవ్యలోటు పెరగడానికి కారణమవుతుందని కూడా నివేదిక అంచనా వేసింది.