
GST collection: జూన్ నెలలో GST వసూళ్లురూ.1.85 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తాజా వస్తువులు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల గణాంకాలను విడుదల చేసింది. 2025 జూన్ నెలలో మొత్తం రూ.1.85 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 6.2 శాతం అధికంగా ఉందని తెలిపింది. అయితే, గత నెలల వసూళ్లతో పోల్చితే ఈసారి వసూళ్లలో కొంత తగ్గుదల నమోదైన విషయాన్ని గమనించవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2.37 లక్షల కోట్లతో రికార్డు స్థాయిలో ఉన్నట్లు కేంద్రం గుర్తుచేసింది.
వివరాలు
మే నెలలో GST వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లు
మే నెలలో ఈ వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లుగా ఉండగా, జూన్‌లో మాత్రం రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకలేకపోయాయి. ఇక జీఎస్టీ అమలులోకి వచ్చి ఈరోజుతో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. గత ఐదు సంవత్సరాల్లో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగాయని వివరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.11.37 లక్షల కోట్లుగా ఉండగా, 2024-25 నాటికి అవి రూ.20.08 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.