Page Loader
India-US trade: భారత్‌కు ప్రమాద ఘంటికలు.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్తగా ఉండాలి: జీటీఆర్‌ఐ హెచ్చరిక
అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్తగా ఉండాలి: జీటీఆర్‌ఐ హెచ్చరిక

India-US trade: భారత్‌కు ప్రమాద ఘంటికలు.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్తగా ఉండాలి: జీటీఆర్‌ఐ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాణిజ్య లక్ష్యాలకు అమెరికా-వియత్నాం మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ఒక హెచ్చరికగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వియత్నాంతో నూతన వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని ప్రకటించడంతో ఆసియాలోని అనేక ఎగుమతి దేశాల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈనేపథ్యంలో భారత ఎగుమతిదారులు అప్రమత్తంగా ఉండాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI)తన నివేదికలో పేర్కొంది. తాజాగా వాషింగ్టన్-హనోయ్ మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా,వియత్నాం నుండి వచ్చే అన్నిరకాల వస్తువులపై అమెరికా విధించే టారిఫ్‌లు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా 20శాతం టారిఫ్ విధించనున్నందున వియత్నాం ఎగుమతులైన 135బిలియన్ డాలర్ల విలువైన సరుకు వ్యాపారం దాని ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. వియత్నాం వాణిజ్యంలో భారత్‌కు ప్రధాన పోటీదారిగా ఉన్నా,కొన్నిరంగాల్లో పరస్పర సహకారం ఉంది.

వివరాలు 

వియత్నాం ఎగుమతులకు కఠిన పరిస్థితి.. 

కానీ ఈ తాజా ఒప్పందం భారత్‌కు వ్యూహాత్మకంగా సవాల్‌గా మారుతుందని జీటీఆర్‌ఐ హెచ్చరిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న అమెరికా-వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) స్థానాన్ని ఈ కొత్త ఒప్పందం తీసుకోనుంది. పాత ఒప్పందం ప్రకారం వియత్నాం నుంచి వచ్చే వస్తువులపై 2 నుంచి 10 శాతం మధ్య టారిఫ్‌లు మాత్రమే ఉండేవి. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, సీఫుడ్, ఫర్నీచర్ వంటి ఉత్పత్తులు ఇందులో ఉండేవి. ఈ విధంగా వియత్నాం ఎగుమతులు 800 మిలియన్ డాలర్ల స్థాయి నుండి 135 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. కానీ తాజా ఒప్పందం ప్రకారం పన్ను రేట్లు పెరగడం వల్ల గతం వంటి ఎగుమతి స్థాయిని కొనసాగించడం కష్టంగా మారవచ్చు.

వివరాలు 

వియత్నాం "చైనా కాలనీ"

అంతేకాక, చైనాలో తయారై వియత్నాం ద్వారా అమెరికాలోకి వచ్చే సరుకులపై ఏకంగా 40 శాతం టారిఫ్ విధించాలని అమెరికా ఈ ఒప్పందంలో నిర్ణయించింది. ఇదే విషయంలో ట్రంప్‌కు సలహాదారుడైన పీటర్ నవారో గతంలో వియత్నాంను "చైనా కాలనీ"గా అభివర్ణించడం గమనార్హం. వియత్నాం ఒప్పందం కుదిరినట్లు ప్రకటించినా, దాని తుది నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

భారత ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి.. 

ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో, భారత ప్రభుత్వానికి ఇది అత్యంత సున్నిత దశ. న్యూఢిల్లీ తరఫున ఈ చర్చల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వియత్నాం ఒప్పందం నుండి సరైన పాఠాలు నేర్చుకోవాలని జీటీఆర్‌ఐ సూచిస్తోంది. టారిఫ్‌ రాయితీల ఆకస్మిక తొలగింపు, సరుకు రవాణాపై స్పష్టత లేని నిబంధనలు, ప్రతి ఉత్పత్తిపై ఒకే రకమైన పన్ను విధానాలు వంటివి దీర్ఘకాలిక వాణిజ్య స్థిరత్వాన్ని దెబ్బతీయగలవని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. వియత్నాం ఒప్పందంలోని లోపాలను విశ్లేషించి, భారత వ్యూహకర్తలు తమ భవిష్యత్‌ చర్యలను రూపకల్పన చేయాలని GTRI స్పష్టం చేసింది.