LOADING...
Tejas Crash: ఎయిర్‌షోలో ప్రమాదం.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఫైటర్ జెట్
ఎయిర్‌షోలో ప్రమాదం.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఫైటర్ జెట్

Tejas Crash: ఎయిర్‌షోలో ప్రమాదం.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఫైటర్ జెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధవిమానమైన 'తేజస్' కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దుబాయ్ ఎయిర్ షో ప్రదర్శన విన్యాసాలు కొనసాగుతున్న సమయంలో తేజస్ విమానం అకస్మాత్తుగా కూలి, భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానాన్ని నడిపిన పైలట్ పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.