Page Loader
Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి.. తులం ఎంతంటే..?
మళ్లీ భారీగా పెరిగిన పసిడి.. తులం ఎంతంటే..?

Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి.. తులం ఎంతంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఆషాఢ మాసం పండుగల హంగామా, త్వరలో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడి ధరలు పరుగులు పెడుతోంది. జూన్ నెలాఖరులో వరుసగా 7 నుంచి 8 రోజుల పాటు బంగారం ధరలు క్రమంగా తగ్గినప్పటికీ, జూలై నెల ప్రారంభం నుంచి మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది ఒక్కసారిగా షాక్‌లా మారింది. జూలై మొదటి తేదీ నుంచి పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో, నేడు కూడా మళ్లీ రేట్లు పెరిగినట్టు కనిపిస్తోంది.

వివరాలు 

ప్రముఖ నగరాలు,పట్టణాల్లో నేటి బంగారం,వెండి ధరలు

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ నగరాలు,పట్టణాల్లో ఈరోజు (తాజా ధరల ప్రకారం) బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి: ఢిల్లీ: ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,050 కాగా,22 క్యారెట్ల ధర రూ.90,810గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,09,900గా ఉంది. ముంబై: 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,900గా ఉండగా,22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,09,900గా ఉంది. చెన్నై: ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,900గా ఉండగా,22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,20,100గా ఉంది. బెంగళూరు: 24 క్యారెట్ల ధర రూ.98,900 కాగా,22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,19,900గా ఉంది.

వివరాలు 

ప్రముఖ నగరాలు,పట్టణాల్లో నేటి బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,900గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం: ఈ రెండు పట్టణాల్లోనూ 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,900గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,19,900గా ఉంది.