
మైక్రోసాఫ్ట్ లో అపర్ణ చెన్నప్రగడకు కీలక పదవి.. కార్పొరేట్ ఉపాధ్యక్షురాలిగా నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో భారతీయ అమెరికన్ ఉన్నత ఉద్యోగికి కీలక పదవి వరించింది.
ఈ మేరకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇండో అమెరికన్ (INDO AMERICAN) మహిళ అపర్ణ చెన్నప్రగడ నియామకమయ్యారు.
టెక్నాలజీ ఇండస్ట్రీలో విశేష అనుభవం సొంతం చేసుకున్న అపర్ణకు, కీలకమైన ఏఐ- ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ARTIFICIAL INTELLIGENCE) విభాగం బాధ్యతలను అప్పగించారు.
మద్రాస్ ఐఐటీలో పట్టభద్రురాలైన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకుపైగా నైపుణ్యం ఉంది. గూగుల్‌లో దాదాపు 12 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు.
మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్‌లో జెనరేటివ్ ఏఐ ప్రాజెక్టులకు నేతృత్వం వహించనున్నారు.
DETAILS
గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ
అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ పూర్తి చేశారు.
అనంతరం టెక్సాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్(CSE)లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్‌లో మరో డబుల్ మాస్టర్స్ డిగ్రీ పట్టాని సాధించారు.
ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, AR, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గానూ అపర్ణ పని చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ ల మధ్య ఉన్న తీవ్రమైన పోటీ సందర్భంలో మైక్రోసాఫ్ట్ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ఈ క్రమంలోనే USకు చెందిన బిజినెస్ పబ్లికేషన్ 'ఇన్ఫర్మేషన్' నివేదికలు విడుదల చేసింది.